Posts

సద్భావనలు - పునర్జన్మ

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి । తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ ।। 2.22 ।। ఆత్మ స్వభానాన్ని వివరిస్తూ శ్రీ కృష్ణుడు పునర్జన్మ సిద్దాంతాన్ని రోజూ మనం చేసే పని ద్వారా స్పష్టముగా వివరిస్తున్నారు.  వస్త్రములు చిరిగిపోయి పనికిరాకుండా పోయినప్పుడు మనం వాటిని వదిలివేసి కొత్త వాటిని ధరిస్తాము. కానీ ఈ ప్రక్రియ లో మనము మారిపోము. ఇదే విధముగా ఒక దేహమును వదిలి మరోచోట ఇంకొక దేహములో పుట్టే ప్రక్రియలో ఆత్మ మార్పునకు లోను కాదు. పునర్జన్మ ఉంటుందని నిరూపించటానికి గౌతమ మహర్షి న్యాయ దర్శనము ఈ క్రింది వాదన ని చెపుతోంది. జాతస్య హర్షభయశోక సంప్రతిపత్తేః (3.1.18) మనం అప్పుడే పుట్టిన నెలల శిశువుని గమనిస్తే ఏ పత్యేకమైన కారణం లేకుండానే ఒక్కోసారి ఆనందంగా ఉంటుంది ఒక్కోసారి విషాదంగా ఉంటుంది ఒక్కోసారి భయపడుతూ ఉంటుంది. న్యాయ దర్శనము ప్రకారం ఆ శిశువు తన పూర్వ జన్మను గుర్తు చేసుకొంటోంది కాబట్టి ఈ భావోద్వేగాలను అనుభవిస్తోంది. కానీ అ శిశువు పెరిగే కొద్దీ ప్రస్తుత జన్మ గుర్తులు మనసులో బలంగా ముద్రింపబడటం వలన అవి గత జన్మ స్మృతులను తుడిచివేస్తాయి. అంతేకాక పుట్టుక మరణము అనే ప్రక్రియలు ఆ

సద్భావనలు - భగవద్గీత - భగవంతుడు

యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి । తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి  ।। 6.30 ।। భగవంతుడికి దూరంగా ఉండుట అనగా స్వామి మన మనస్సులో ఉన్నారు అనే భావన విడుచుటయే.  ఆయనతో ఉండటం అంటే మనస్సు ని స్వామితో ఏకం చేయటయే. మనస్సుని భగవంతుని తో ఏకం చేయటానికి ఒక సులువైన మార్గం ఏమిటంటే ప్రతి విషయాన్ని ఆయనతో సంబంధంగా చూడటమే. ఉదాహరణకి, మనలని ఎవరైనా కించపరిచారు అనుకుందాం. మనస్సు యొక్క స్వభావం ఏమిటంటే, మనకు హాని చేసిన వారి పట్ల అది, ద్వేషము, కోపము వంటి వాటిని పెంచుకుంటుంది. అప్పుడు మన మనస్సు స్వామి భావనల నుండి వేరు అవుతుంది. భాగవదనుభూతి నుండి బయటకు రావటంతో, భగవంతునితో మన మనస్సు యొక్క భక్తి యుక్త సంయోగం ఆగిపోతుంది. అలా కాక, ఆ వ్యక్తి లో కూర్చొని ఉన్న పరమాత్మ ను దర్శిస్తే మనం ఇలా అనుకుంటాము, “భగవంతుడు నన్ను ఈ వ్యక్తి ద్వారా పరీక్షిస్తున్నాడు, ఆయన నా సహన శీలతను పెంచుకోమని ఉపదేశిస్తున్నాడు, అందుకే ఆ వ్యక్తిని నాతో కఠినంగా ప్రవర్తించమని ప్రేరేపిస్తున్నాడు. కానీ, నేను ఈ సంఘటన నన్ను కలచివేయకుండా చూసుకుంటాను." ఈ విధంగా ఆలోచిస్తే, మన మనస్సుని చెడురకపు ఆలోచనలు బాధించకుండా కాపాడుకోవచ్చు. కానీ ఇది చెప్

సద్భావనలు: జీవాత్మ - పరమాత్మ

జీవాత్మ - పరమాత్మ  బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున । తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ।। 4.5 ।। కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా అంటున్నారు. అర్జునా మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడచినవి. నీవు వాటిని మరిచిపోయావు. కానీ అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి తాను అర్జునుడి ముందు మానవ రూపంలో నిల్చుని ఉన్నంత మాత్రమున తనను మానవులతో సమానంగా పరిగణించవద్దు అని వివరిస్తున్నాడు శ్రీ కృష్ణుడు.  ఒక దేశ రాష్ట్రపతి ఒక్కోసారి కారాగారానికి చూడడానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు, కానీ మనం జైల్లో రాష్ట్రపతి కనపడితేమనం ఆయన కూడా ఖైదీ నే అని భావింపము.  ఆయన కేవలం తనిఖీ చేయటానికే ఇలా వచ్చాడు అని మనకు తెలుసు. ఇదే ప్రకారంగా భగవంతుడు ఒక్కోసారి ఈ భౌతిక ప్రపంచంలోకి అవతరిస్తూ ఉంటారు. శ్రీ కృష్ణుడు భగవంతుడు కాడు అని ఏ మూర్ఖులకైనా సందేహం ఉంటే దానిని ఖండించటానికే ఆయన ఈ శ్లోకం చెప్పాడు. నమ్మకం లేని కొంత మంది శ్రీ కృష్ణుడు కూడా మనలాగే పుట్టాడు మనలాగే భుజించాడు, త్రాగాడు, నిద్రపోయాడు; కాబట్టి ఆయన భగవంతుడు అవ్వటానికి అవకాశం లేదు అని వాదించవచ్చు. ఇక్కడ శ్రీ కృష్ణుడు జీవాత్మకి, భగవంతునికి ఉన్న తేడాని స్పష్టంగా వివరిస్తున్నారు. పరమ

సద్భావనలు - ఆరాధన

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి । తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః ।। 9.26 ।। శ్రీహరి యొక్క ఆరాధన ఎంత సులువైనదో ఎంత విలువైనదో ఈ శ్లోకం మనకు తెలుపుతుంది.   దేవతల ఆరాధనలో వారిని ప్రసన్నం చేయటానికి నిష్ఠగా ఆచరించవలసిన ఎన్నో నియమాలు ఉన్నాయి. కానీ భగవంతుడు తనకు ప్రేమ నిండిన హృదయంతో  సమర్పించబడిన ఏదైనా స్వీకరిస్తాడు.  మీ దగ్గర కేవలం ఒక పండు ఉంటే అది సమర్పించండి, భగవంతుడు సంతోషిస్తాడు. ఒకవేళ పండు లేకపోతే ఒక పువ్వు సమర్పించండి. అది పుష్పించే కాలం కాకపొతే భగవంతునికి కేవలం ఒక ఆకు సమర్పించండి; ప్రేమతో ఇచ్చినప్పుడు అది కూడా సరిపోతుంది. ఒకవేళ ఆకులు కూడా దొరకకపోతే, అంతటా లభ్యమయ్యే నీటిని సమర్పించండి. కానీ ఇక్కడ కూడా అది భక్తితో అనగా ప్రేమగా ఇవ్వబడాలి.  భక్త్యా అన్న పదం ఇక్కడ మొదటి మరియు రెండవ భాగాల్లో రెంటిలో వాడబడింది. ఆరాధించే వారి (భక్తుని) యొక్క భక్తి మాత్రమే భగవంతుడిని ప్రసన్నం చేస్తుంది, ఆ సమర్పించబడిన వస్తువు యొక్క విలువ కాదు. ఈ అద్భుతమైన ప్రకటన చేయటంతో భగవద్గీత భగవంతుని యొక్క కరుణాపూరిత స్వభావాన్ని తెలియచేస్తున్నది. తన యందు ప్రేమతో సమర్పించబడిన వస్తువు యొక్క భౌతిక విలువ శ

సద్భావనలు - భగవత్శరణాగతి

చతుర్విధా భజంతే మాం  జనాః సుకృతినోఽర్జున! ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ!! 7.16: లోకంలో ప్రతి ఒక్కరూ ఎదో ఒక రీతిన పరమాత్మగురించి ఆలోచిస్తారు. వాళ్లలో 4 రకాల వారు ఉన్నారు  వారి గూర్చి పరమాత్మ ఇలా అంటున్నారు. 1) ఆర్తులు ( అనగా ఆపదల్లో/దుఖాల్లో ఉన్నవారు.) కొంతమంది జనులు వారికి కష్టాలు ఎక్కువై పోయినప్పుడు లోకంలో ఎవరూ సహాయం చేయలేని పరిస్థితి వచ్చాక  భగవంతుడి గూర్చి పూజలు మొదలు పెడతారు.  తీవ్రకష్టంలో ఎవరూ రక్షించలేకపోయినప్పుడు వారు రక్షణ కోసం భగవంతుడిని ఆశ్రయిస్తారు. దీనినే శరణాగతి అంటారు.  శ్రీ కృష్ణుడికి ద్రౌపది చేసిన శరణాగతి ఇటువంటి కోవకు చెందిన శరణాగతియే.   కౌరవ సభలో ద్రౌపది వివస్త్ర చేయబడుతున్నప్పుడు, ఆమె మొదట తన భర్తలు రక్షిస్తారనుకున్నది. వారు  ఏమీ చేయలేక నోరు మెడపక  ఉండిపోయారు సభలో ఉన్న ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్ముడు విదురుడు వంటి  పెద్దల మీద కాపాడుతారని ఆశ పెట్టుకుని వారి వైపు చూసినా వారు కూడా  రక్షించలేకపోయారు. ఈ స్థితిలో తన పళ్ళ మధ్యలో చీరను గట్టిగా పట్టుకుంది.  ఈ స్థితి వరకు శ్రీ కృష్ణుడు ద్రౌపది రక్షణకు రాలేదు. చివరగా, దుశ్శాసనుడు ఆమె చీరను ఒక్కసారిగా లాగినపుడు

వైఖానస కల్పసూత్రం లో వివాహ భేదాలు

Image
 వైఖానస కల్పసూత్రం లో వివాహ భేదాలు

వైఖానస సూత్రం - వనౌషధుల వినియోగం

Image
వైఖానస సూత్రం - వనౌషధుల వినియోగం (In Telugu) Discourse By: Prof. V S Vishnu Bhattacharyulu ( Vaikhanasa Agama Chudamani ), National Sanskrit University, Tirupati.