సద్భావనలు: జీవాత్మ - పరమాత్మ
జీవాత్మ - పరమాత్మ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున । తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ।। 4.5 ।। కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా అంటున్నారు. అర్జునా మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడచినవి. నీవు వాటిని మరిచిపోయావు. కానీ అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి తాను అర్జునుడి ముందు మానవ రూపంలో నిల్చుని ఉన్నంత మాత్రమున తనను మానవులతో సమానంగా పరిగణించవద్దు అని వివరిస్తున్నాడు శ్రీ కృష్ణుడు. ఒక దేశ రాష్ట్రపతి ఒక్కోసారి కారాగారానికి చూడడానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు, కానీ మనం జైల్లో రాష్ట్రపతి కనపడితేమనం ఆయన కూడా ఖైదీ నే అని భావింపము. ఆయన కేవలం తనిఖీ చేయటానికే ఇలా వచ్చాడు అని మనకు తెలుసు. ఇదే ప్రకారంగా భగవంతుడు ఒక్కోసారి ఈ భౌతిక ప్రపంచంలోకి అవతరిస్తూ ఉంటారు. శ్రీ కృష్ణుడు భగవంతుడు కాడు అని ఏ మూర్ఖులకైనా సందేహం ఉంటే దానిని ఖండించటానికే ఆయన ఈ శ్లోకం చెప్పాడు. నమ్మకం లేని కొంత మంది శ్రీ కృష్ణుడు కూడా మనలాగే పుట్టాడు మనలాగే భుజించాడు, త్రాగాడు, నిద్రపోయాడు; కాబట్టి ఆయన భగవంతుడు అవ్వటానికి అవకాశం లేదు అని వాదించవచ్చు. ఇక్కడ శ్రీ కృష్ణుడు జీవాత్మకి, భగవంతునికి ఉన్న తేడాని స్పష్టంగా వివరిస...