Posts

Showing posts with the label భగవంతుడు

సద్భావనలు - భగవద్గీత - భగవంతుడు

యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి । తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి  ।। 6.30 ।। భగవంతుడికి దూరంగా ఉండుట అనగా స్వామి మన మనస్సులో ఉన్నారు అనే భావన విడుచుటయే.  ఆయనతో ఉండటం అంటే మనస్సు ని స్వామితో ఏకం చేయటయే. మనస్సుని భగవంతుని తో ఏకం చేయటానికి ఒక సులువైన మార్గం ఏమిటంటే ప్రతి విషయాన్ని ఆయనతో సంబంధంగా చూడటమే. ఉదాహరణకి, మనలని ఎవరైనా కించపరిచారు అనుకుందాం. మనస్సు యొక్క స్వభావం ఏమిటంటే, మనకు హాని చేసిన వారి పట్ల అది, ద్వేషము, కోపము వంటి వాటిని పెంచుకుంటుంది. అప్పుడు మన మనస్సు స్వామి భావనల నుండి వేరు అవుతుంది. భాగవదనుభూతి నుండి బయటకు రావటంతో, భగవంతునితో మన మనస్సు యొక్క భక్తి యుక్త సంయోగం ఆగిపోతుంది. అలా కాక, ఆ వ్యక్తి లో కూర్చొని ఉన్న పరమాత్మ ను దర్శిస్తే మనం ఇలా అనుకుంటాము, “భగవంతుడు నన్ను ఈ వ్యక్తి ద్వారా పరీక్షిస్తున్నాడు, ఆయన నా సహన శీలతను పెంచుకోమని ఉపదేశిస్తున్నాడు, అందుకే ఆ వ్యక్తిని నాతో కఠినంగా ప్రవర్తించమని ప్రేరేపిస్తున్నాడు. కానీ, నేను ఈ సంఘటన నన్ను కలచివేయకుండా చూసుకుంటాను." ఈ విధంగా ఆలోచిస్తే, మన మనస్సుని చెడురకపు ఆలోచనలు బాధించకుండా కాపాడుకోవచ్చు. కానీ ఇది ...