సద్భావనలు - భగవద్గీత - భగవంతుడు

యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి ।

తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి  ।। 6.30 ।।

భగవంతుడికి దూరంగా ఉండుట అనగా స్వామి మన మనస్సులో ఉన్నారు అనే భావన విడుచుటయే.  ఆయనతో ఉండటం అంటే మనస్సు ని స్వామితో ఏకం చేయటయే.

మనస్సుని భగవంతుని తో ఏకం చేయటానికి ఒక సులువైన మార్గం ఏమిటంటే ప్రతి విషయాన్ని ఆయనతో సంబంధంగా చూడటమే. ఉదాహరణకి, మనలని ఎవరైనా కించపరిచారు అనుకుందాం. మనస్సు యొక్క స్వభావం ఏమిటంటే, మనకు హాని చేసిన వారి పట్ల అది, ద్వేషము, కోపము వంటి వాటిని పెంచుకుంటుంది. అప్పుడు మన మనస్సు స్వామి భావనల నుండి వేరు అవుతుంది. భాగవదనుభూతి నుండి బయటకు రావటంతో, భగవంతునితో మన మనస్సు యొక్క భక్తి యుక్త సంయోగం ఆగిపోతుంది.

అలా కాక, ఆ వ్యక్తి లో కూర్చొని ఉన్న పరమాత్మ ను దర్శిస్తే మనం ఇలా అనుకుంటాము, “భగవంతుడు నన్ను ఈ వ్యక్తి ద్వారా పరీక్షిస్తున్నాడు, ఆయన నా సహన శీలతను పెంచుకోమని ఉపదేశిస్తున్నాడు, అందుకే ఆ వ్యక్తిని నాతో కఠినంగా ప్రవర్తించమని ప్రేరేపిస్తున్నాడు. కానీ, నేను ఈ సంఘటన నన్ను కలచివేయకుండా చూసుకుంటాను." ఈ విధంగా ఆలోచిస్తే, మన మనస్సుని చెడురకపు ఆలోచనలు బాధించకుండా కాపాడుకోవచ్చు. కానీ ఇది చెప్పినంత తెలిక కాదని మనకు తెలుసు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్లడం కోసం మెల్లగా మనం ఇలాంటి ప్రయత్నం చేయాలి. 

నిజానికి మనకు కోపం కలిగించే విషయాలు పరిశీలనగా చూస్తే మన అహంభావం వల్ల ఏర్పడ్డవే ఎక్కువ ఉంటాయి. వాటిని మనం అదుపులో ఉంచుకోగలం. కేవలం ఎవరిమీదో ఉన్నకోపం తగ్గిస్తే మాత్రం సరిపోదు మన చుట్టూ ఉండే మనుషుల పట్ల మనకు ఉండే అతి ప్రేమ ను కూడా తగించుకోవాలి.  ఉదాహరణకు భార్య పిల్లలు మిత్రులు లేదా బంధువుతో ఒక  అనుబంధం ఏర్పడినప్పుడు కూడా మన మనస్సు భగవంతుని నుండి వేరయిపోతుంది. ఇప్పుడు, మనం మనస్సుకు ఆ మనిషిలో భగవంతుడిని దర్శించే శిక్షణ ఇస్తే  ప్రతిసారీ మనస్సు వారి మీదకు పోయినప్పుడు మనం ఇలా అనుకోగలగాలి పరమాత్మ వారిలోనూ ఉన్నాడు, అందుకే నేను వారి పట్ల ఆకర్షితుడను అవుతున్నాను అని. ఇది కూడా వినడానికి వింతగానే అనిపించవచ్చు. లోతుగా తరచి చూసిన మహర్షులు చెప్పిన ఈ పద్దతి నిజానికి అంత కష్టమేమీ కాదు. 

మనకు నిజమైన ప్రయోజనం కలిగించె విషయం ఎదో రకంగా మనస్సుని భగవంతుని యందే నిలపటం మాత్రమే అని మనకు అర్థమయిన నాడు మనసును శ్రీహరిపై నిలుపగలము. మరియు దీనికి ఒక సులువైన ఉపాయం ఏమిటంటే  ప్రతివ్యక్తిలో వస్తువులలో పనుల్లో భగవంతున్ని చూడడం ప్రారంభం చేయాలి. ఇది అభ్యాస స్థాయి. ఆ భావన పై శ్లోకంలో చెప్పబడిన పరిపూర్ణ స్థాయి దిశగా  తీసుకువెళుతుంది, ఇక అప్పుడు మనం శ్రీహరికి దగ్గర కాగలము అలానే శ్రీహరి మనకు దూరం కాడు. భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్.

 ~ గంజాం రామకృష్ణ 

Comments

Popular posts from this blog

Vikhanasa Maharshi

సద్భావనలు: జీవాత్మ - పరమాత్మ