సద్భావనలు - పునర్జన్మ
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి । తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ ।। 2.22 ।। ఆత్మ స్వభానాన్ని వివరిస్తూ శ్రీ కృష్ణుడు పునర్జన్మ సిద్దాంతాన్ని రోజూ మనం చేసే పని ద్వారా స్పష్టముగా వివరిస్తున్నారు. వస్త్రములు చిరిగిపోయి పనికిరాకుండా పోయినప్పుడు మనం వాటిని వదిలివేసి కొత్త వాటిని ధరిస్తాము. కానీ ఈ ప్రక్రియ లో మనము మారిపోము. ఇదే విధముగా ఒక దేహమును వదిలి మరోచోట ఇంకొక దేహములో పుట్టే ప్రక్రియలో ఆత్మ మార్పునకు లోను కాదు. పునర్జన్మ ఉంటుందని నిరూపించటానికి గౌతమ మహర్షి న్యాయ దర్శనము ఈ క్రింది వాదన ని చెపుతోంది. జాతస్య హర్షభయశోక సంప్రతిపత్తేః (3.1.18) మనం అప్పుడే పుట్టిన నెలల శిశువుని గమనిస్తే ఏ పత్యేకమైన కారణం లేకుండానే ఒక్కోసారి ఆనందంగా ఉంటుంది ఒక్కోసారి విషాదంగా ఉంటుంది ఒక్కోసారి భయపడుతూ ఉంటుంది. న్యాయ దర్శనము ప్రకారం ఆ శిశువు తన పూర్వ జన్మను గుర్తు చేసుకొంటోంది కాబట్టి ఈ భావోద్వేగాలను అనుభవిస్తోంది. కానీ అ శిశువు పెరిగే కొద్దీ ప్రస్తుత జన్మ గుర్తులు మనసులో బలంగా ముద్రింపబడటం వలన అవి గత జన్మ స్మృతులను తుడిచివేస్తాయి. అంతేకాక పుట్టుక మరణము అనే ప్రక్రియ...