సద్భావనలు - ఆరాధన
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి । తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః ।। 9.26 ।। శ్రీహరి యొక్క ఆరాధన ఎంత సులువైనదో ఎంత విలువైనదో ఈ శ్లోకం మనకు తెలుపుతుంది. దేవతల ఆరాధనలో వారిని ప్రసన్నం చేయటానికి నిష్ఠగా ఆచరించవలసిన ఎన్నో నియమాలు ఉన్నాయి. కానీ భగవంతుడు తనకు ప్రేమ నిండిన హృదయంతో సమర్పించబడిన ఏదైనా స్వీకరిస్తాడు. మీ దగ్గర కేవలం ఒక పండు ఉంటే అది సమర్పించండి, భగవంతుడు సంతోషిస్తాడు. ఒకవేళ పండు లేకపోతే ఒక పువ్వు సమర్పించండి. అది పుష్పించే కాలం కాకపొతే భగవంతునికి కేవలం ఒక ఆకు సమర్పించండి; ప్రేమతో ఇచ్చినప్పుడు అది కూడా సరిపోతుంది. ఒకవేళ ఆకులు కూడా దొరకకపోతే, అంతటా లభ్యమయ్యే నీటిని సమర్పించండి. కానీ ఇక్కడ కూడా అది భక్తితో అనగా ప్రేమగా ఇవ్వబడాలి. భక్త్యా అన్న పదం ఇక్కడ మొదటి మరియు రెండవ భాగాల్లో రెంటిలో వాడబడింది. ఆరాధించే వారి (భక్తుని) యొక్క భక్తి మాత్రమే భగవంతుడిని ప్రసన్నం చేస్తుంది, ఆ సమర్పించబడిన వస్తువు యొక్క విలువ కాదు. ఈ అద్భుతమైన ప్రకటన చేయటంతో భగవద్గీత భగవంతుని యొక్క కరుణాపూరిత స్వభావాన్ని తెలియచేస్తున్నది. తన యందు ప్రేమతో సమర్పించబడిన వస్...