వైఖానస గ్రంథములు
వైఖానస గ్రంథములు యజ్ఞాధికారము 51 వ అధ్యాయంలో ఏయే ఋషులు ఏయే గ్రంథములు రచించినదీ తెలుపబడినది. భృగు మహర్షి ప్రోక్తములు యజ్ఞాధికారము, ఖిలాధికారము, క్రియాధికారము, వాసాధికరము, మానాధికారము, నిరుక్తాధికారము, ప్రకీర్ణాధికారము, అర్చనాధికారము, వర్ణాధికారము, పురాధికారము, చిత్రాధికారము. మరీచి మహర్షి ప్రోక్తములు జయసంహిత, ఆనందసంహిత , సంజ్ఞానసంహిత , వీరసంహిత , విజయసంహిత, విజితసంహిత, విమలసంహిత , జ్ఞానసంహిత , విమానార్చనాకల్పము అను 9 గ్రంథములు. అత్రి మహర్షి ప్రోక్తములు సమూర్తార్చనాధికారము అనబడే ఆత్రేయతంత్రము , పూర్వతంత్రము , విష్ణు తంత్రము , ఉత్తర తంత్రము, అను గ్రంథములు. కాశ్యప మహర్షి ప్రోక్తములు సత్యకాండ, తర్కకాండ, జ్ఞానకాండ, సంతానకాండ, కాశ్యపకాండ .